మధుమేహాన్ని సరైన ఆహారం, వ్యాయామంతో పూర్తిగా నియంత్రించుకోవచ్చు.

డయాబెటిక్‌లో ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే.. అంత మంచిది అంటున్నారు నిపుణులు.

గుడ్డు మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, పోషకాలతో నిండి ఉన్న మంచి పోషకాహారంగా నిపుణులు చెబుతున్నారు.

శరీరాకృతిని కాపాడుకోవాలనుకునే వారు రోజూ ఒక గుడ్డు తినడం అలవాటు చేసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిక్‌లో గుడ్డు సరైన ఆహారమే. అయితే, మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే అది సరైన ఫలితం ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

షుగర్‌ బాధితులు వారానికి 3 లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు 39 శాతం పెరుగుతాయని ఒక అధ్యయనంలో తేలింది.

షుగర్ ఉన్నవారు కూడా మితంగా గుడ్లు తినవచ్చు అంటున్నారు నిపుణులు.

ప్రీ-డయాబెటిస్ ఉన్నావారు గుడ్డు వల్ల గుండె సమస్యలు తగ్గిన‌ట్లు అధ్యయనాల్లో వెల్లడయ్యాయి. గుడ్డు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదే.