ఈ లక్షణాలుంటే.. టీ తాగకండి..!

మనదేశంలో చాలా మంది ఇష్టపడే పానీయం టీ. ఛాయ్‌లో కొన్ని పదుల సంఖ్యలో ఫ్లేవర్లు ఉన్నాయి.

టీ ఎంత ఇష్టమైనప్పటికీ ఈ ఆరు లక్షణాలున్న వారు మాత్రం దాని జోలికి వెళ్లకపోవడమే మంచిది. 

మీకు ఎసిడిటీ ఉంటే దానిని టీ మరింత తీవ్రతరం చేస్తుంది. 

గర్భంతో ఉన్న మహిళలు టీ ఎక్కువగా తాగితే కెఫిన్ సంబంధిత సమస్యలు మొదలవుతాయి. 

ఐరన్ లోపం ఉన్న వారు టీ జోలికి వెళ్లకూడదు. ఐరన్ శోషణాన్ని టీ అడ్డుకుంటుంది. 

టీలోని టన్నిన్స్ కొందరిలో అలర్జీలకు కారణమవుతాయి. నిద్రలేమికి టీ కారణమవుతుంది. 

చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారు కూడా టీకి దూరంగా ఉండడం మంచిది. 

12 సంవత్సరాల లోపు పిల్లలు కచ్చితంగా టీ తాగకూడదు.