ఇలా చేస్తే మీ బ్రెయిన్ షార్ప్‌గా  పనిచేస్తుందట..

కొత్త భాషలు, వాయిద్యాలు, ఆటలు నేర్చుకోవడం మెదడుకు వ్యాయామం లాంటిది. 

ఇవి మెదడులోని వివిధ భాగాలను ఉత్తేజపరుస్తాయి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. 

కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది.

చదివేటప్పుడు, వినేటప్పుడు, చూసేటప్పుడు, రుచి చూసేటప్పుడు, వాసన చూసేటప్పుడు ఎక్కువ ఇంద్రియాలను ఉపయోగించడం వల్ల మెదడులోని ఎక్కువ భాగాలు ఉత్తేజితమవుతాయి

 గుర్తుంచుకోవాలనుకున్న సమాచారాన్ని మళ్లీ చదవడం లేదా రాయడం ద్వారా జ్ఞాపకశక్తిని బలోపేతం చేయవచ్చు

పునరావృతం చేయడం వల్ల మెదడులోని కనెక్షన్లు బలపడతాయి.

ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చు.