రోజూ ఇలా చేయకపోతే  దంతాలు పాడవటం పక్కా!

దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 

ఉదయం పూట, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కచ్చితంగా బ్రష్ చేసుకోవాలి. ఇలా చేస్తే పళ్లపై గారా, బ్యాక్టీరియా వంటివి తొలగిపోతాయి. 

 దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించేందుకు ఫ్లాసింగ్ తప్పనిసరి. దారంలా ఉంటే డెంటల్ ఫ్లాస్‌తో పళ్లను శుభ్రంగా ఉంచుకోవచ్చు.

 నాలుక గీసుకునే విషయంలోనూ జాగ్రత్త తప్పనిసరి. గార పోయేలా జాగ్రత్తగా నాలుక గీసుకోవాలి.

దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగాలి.

చెక్కర, ఆమ్ల లక్షణాలు ఉన్న ఆహారానికి దూరంగా ఉంటే పళ్లపై ఉండే ఎనామిల్ పొర సురక్షితంగా ఉంటుంది. 

తరచూ డెంటల్ చెకప్‌కు వెళుతుండాలి. దీంతో, సమస్యలేమైనా ఉంటే ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.