బరువు తగ్గాలనుకునే వాళ్లు ఎంత ప్రోటీన్ తీసుకోవాలో తెలుసా..

ప్రోటీన్ ఆరోగ్యానికి మంచిదే. కానీ.. మరీ అతిగా తీసుకుంటే అదే హానికరంగా మారుతోంది.  

కేవలం ఒకటి రెండు ఆహార పదార్థాలపైనే ఆధారపడకుండా రకరకాల ఫుడ్స్ ఎలా తీసుకోవాలి. వాటిలో ఎంత ప్రోటీన్ ఉంటుందన్నదీ గమనించాలి.

ప్రొటీన్ ఇన్ టేక్ అనేది వెయిట్ ఆధారంగా ఉంటుంది. అంటే.. కిలో బరువుకు కనీసం 0.75 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి.

నిజానికి.. ప్రోటీన్ అనేది మీ అరచేతిలో ఇమిడిపోయేంత సైజ్ లో ఉండాలనేది ఓ రూల్. అంత మాత్రమే తీసుకోవాలి.

వయసుని బట్టి ఈ మోతాదు మారిపోతూ ఉంటుంది. పసి పిల్లలు.. ఏడాది వయసు వచ్చేంత వరకూ వాళ్ల బాడీ వెయిట్‌లో కిలో బరువుకు 1.6 నుంచి 2.2 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి.

బరువు తగ్గాలనుకుంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజుకి కనీసం 38 గ్రాముల వరకూ ఫైబర్ ఇన్ టేక్ ఉండేలా చూసుకోవాలి.

ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆల్కహాల్ తగ్గించాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గిస్తే చాలా వరకూ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.