పాలు-పండ్లు కలిపి తింటున్నారా ? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
పాలలో ప్రోటీన్, కాల్షియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. మరోవైపు పండ్లలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. కానీ పాలు జీర్ణం కావడానికి టైం పడుతుంది. ఈ రెండూ కలిపి తింటే, జీర్ణక్రియ మందగిస్తుంది.
ఈ రెండింటినీ కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేదం ప్రకారం, పుల్లని పండ్లు (నారింజ, స్ట్రాబెర్రీలు వంటివి) పాలతో కలిపి తినడం మంచిది కాదు.
ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో విష పదార్థాలుగా మారుతాయి. దీని వలన అలసటగా అనిపించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి.
పాలు పండ్లూ కలిపి తినడం వల్ల జీర్ణం సరిగా కాకపోతే, ముఖంపై మొటిమలు, దద్దుర్లు, చర్మం ఉప్పగా మారటం వంటి సమస్యలు రావచ్చు.
పాలు, పండ్లను వేర్వేరుగా తినడం మంచిది. మధ్యలో కనీసం 30 నిమిషాల గ్యాప్ ఉండాలి.
కలిపి తినాలంటే మామిడి లేదా అరటిపండ్లతో పాలను తీసుకోవచ్చు.
Related Web Stories
మీ గోర్లు ఇలా ఉంటే.. ఆరోగ్య సమస్యలు ఉన్నట్టే..
చలికాలంలో రోజూ ముల్లంగిని తింటే ఏం జరుగుతుందో తెలుసా..
టీ - కాఫీలో ఏది బెస్టో తెలుసా
మొక్కజొన్న తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..