ఆరోగ్యానికి నిధి.. పచ్చి బాదంపప్పు   తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

ప‌చ్చిబాదంలోనూ అనేక పోష‌కాలు ఉంటాయి. ఎండిన బాదం కంటే కూడా పచ్చి బాదంలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది.

 మ‌ల‌బ‌ద్ద‌కం సమస్య త‌గ్గుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

 బ‌రువు తగ్గేందుకు స‌హాయ ప‌డుతుంది

పచ్చి బాదంపప్పు తినడం వలన క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

ప‌చ్చి బాదంలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టంగా మారుస్తాయి.

పచ్చి బాదం తినటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

హైబీపీ ఉన్న‌వారికి ప‌చ్చిబాదం ఎంతో మేలు చేస్తుంది. దీంతోపాటు గుండె పోటు రాకుండా ర‌క్షిస్తుంది.

 ప‌చ్చి బాదంలో ఉండె యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ ఇ  చర్మం, జుట్టు సంరక్షణకు మేలు చేస్తుంది.