జామ ఆకులు అనేక  ఆరోగ్య ప్రయోజనాలను  అందించే సహజ  ఔషధంగా పనిచేస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

వారానికి మూడు సార్లు జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియను మెరుగుపర్చడం,రోగనిరోధక శక్తిని పెంచడం,చర్మ ఆరోగ్యం,గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

జామ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

జామ ఆకులు గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి ఉపయోగపడతాయి. అజీర్ణం, ఉబ్బరం తగ్గించటానికి ఈ ఆకులు సహాయపడతాయి

జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. 

జామ ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల ఇవి చిగుళ్ల వ్యాధి, దుర్వాసన, కావిటీస్ ను తగ్గిస్తాయి.

జామ ఆకుల యాంటీ స్పాస్మోడిక్ ప్రభావాలు ఋతు సమయంలో కలిగే నొప్పులను తగ్గించటంలో సహాయపడతాయి