గ్యాస్ సమస్య వేధిస్తోందా..  ఈ చిట్కాలు మీకోసమే..

ఇంగువ కడుపులోని గ్యాస్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.

జీర్ణక్రియ సజావుగా సాగడానికి అల్లం శక్తివంతమైన ఆయుర్వేద మూలిక.

జీర్ణ సమస్యలను తగ్గించేందుకు జీలకర్ర ఉపయోగపడుతుంది.

అల్లం, ఎండుమిర్చి, మిరియాలు కలిపిన త్రికటు చూర్ణం పరగడుపున తీసుకుంటే ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి.

బీన్స్, ఉల్లిపాయలు, క్యాబేజీ, కార్బొనేటెడ్ పానియాలకు దూరంగా ఉండండి. మసాల, వేపుడు పదార్థాలు తీసుకోకండి.

రోజూ ఒకే సమయానికి భోజనం చేయండి. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినండి.

రాత్రి నిద్రపోవడానికి రెండు గంటల ముందు భోజనం ముగించండి.

యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి.