మెగ్నీషియంతో కండరాల ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు

దీని వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి రాత్రిళ్లు కంటినిండా నిద్ర పడుతుంది. 

మెగ్నీషియంతో శరీరంలో ఫ్లూయిడ్స్ సమతౌల్యం నెలకొని డీహైడ్రేషన్ సంబంధిత నొప్పులు దరిచేరవు

కండరాల్లో తగినంత శక్తి నిల్వలు ఉండి త్వరగా అలసట రాకుండా ఉండేందుకు మెగ్నీషియం అవసరం

మెగ్నీషియంతో కండరాల సంకోచవ్యాకోచాలకు ఎలాంటి ఆటంకాలు రావు

నాడీ వ్యవస్థ పనితీరుకు కూడా మెగ్నీషియం కీలకం

కాబట్టి, నిత్యం కండరాలు నొప్పి పెడుతున్నాయంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. 

పాలకూర, బాదంపప్పు, అరటిని తింటే మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది.