రాత్రి నిద్ర పోయే ముందు మంచి నీళ్లు తాగడం లాభమా? నష్టమా?
ప్రతి మనిషికి తిండి ఎంత అవసరమో.. నీరు సైతం అంతే అవసరం.
ఆహారం లేకుండా కేవలం నీళ్లు తాగుతూ ఒక వ్యక్తి వారం రోజులపాటు బతకుతాడు.
రాత్రి పడుకునే ముందు నీరు తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అది కూడా సరైన పరిమాణం,సరైన సమయంలో తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు గ్లాసు నీళ్లు తాగడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం తదితర సమస్యలు దూరమవుతాయి.
రక్తప్రసరణను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.
రాత్రి వేళ నీళ్లు తాగడం వల్ల హార్ట్ ఎటాక్ ప్రమాదం తగ్గుతుంది.
నిద్ర పోయే ముందు నీళ్లు తాగితే చర్మ కణాలకు తేమ కలిగి.. చర్మం తాజాగా అందంగా ఉంటుంది.
సరిపడా నీళ్లు తాగితే శరీరం హైడ్రేట్ అయి.. మెదడు బాగా పని చేస్తుంది.
నీళ్లు తాగి నిద్రిస్తే.. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
కిడ్నీల్లో మలినాలు ఏర్పడవు. బరువు తగ్గడానికి సహయపడుతుంది.
రాత్రి వేళ.. నీళ్లు తాగితే కాలేయం డిటాక్స్ అవుతుంది. తద్వారా వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
రాత్రి నిద్ర పోయే ముందు నీళ్లు తాగితే శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో తాగితే మంచిది.