బిట్టర్ ఆల్మండ్స్ చాలా ప్రమాదకరం. వాటిలో హైడ్రోసైనిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. తింటే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. 

పూర్తిగా తోలు తీయని ఆకీ పండ్లు చాలా ప్రమాదకరం. అందులో విషం ఉంటుంది. 

కస్సావాలోని కొన్ని రకాలలో పెద్ద మొత్తంలో సైనెడ్ ఉంటుంది. ఎక్కువ మొత్తంలో తింటే ప్రాణాలకు ప్రమాదం.

మొలకెత్తిన ఆలుగడ్డలు లేదా పచ్చగా ఉండే ఆలుగడ్డలు తినటం ప్రమాదం. వాటిలో సొలనైన్ అనే విషం ఉంటుంది. ఎంత ఉడికించినా పోదు. 

కొన్ని రకాల పుట్టగొడుగుల్లో విషం ఉంటుంది. వాటిని తింటే ప్రాణాలకే ప్రమాదం. 

ఎర్రటి కిడ్నీ బీన్స్‌ను ఉడికించకుండా తింటే ప్రాణాలకే ప్రమాదం. వాటిలో లెక్టి్న్స్ అనే టాక్సిన్స్ ఉంటాయి.

కిడ్నీ సమస్య ఉన్న వారు స్టార్ ఫ్రూట్ తినకపోవటం చాలా ఉత్తమం. 

జాజికాయను తక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం.