పుచ్చకాయ గింజలు రోజు తింటే..

పుచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని తినేసి, దాని విత్తనాలు పడేస్తుంటారు. ఇది సాధారణంగా అందరూ చేసేదే.

పుచ్చకాయ గింజలలో అనేక ఖనిజాలు ఉంటాయి. వీటిలో ఒకటి మెగ్నీషియం. 4 గ్రాముల విత్తనాలలో దాదాపు 21 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది.

పుచ్చ గింజ‌ల ప‌ప్పులోని అధికంగా లభించే జింక్‌, ఐర‌న్‌, విట‌మిన్ ఇ రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను మెరుగుపరుస్తాయి.

అలాగే గాయాలు, పుండ్లు కూడా త్వ‌ర‌గా న‌యం అవుతాయి. సీజ‌న‌ల్ వ్యాధులైన ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం సమస్యలు కూడా తగ్గుతాయి.

పుచ్చకాయ గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, గుండెపోటు, స్ట్రోక్‌లను నివారించడానికి సహకరిస్తాయి.

పుచ్చకాయ గింజలలో ప్రోటీన్లు, ఐరన్, మెగ్నీషియం, జింక్ , రాగి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

ఇవి రాత్రంతా నీటిలో నాన‌బెట్టి బ్రేక్ ఫాస్ట్‌లో తింటే శ‌క్తి ల‌భిస్తుంది. అలగే ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు.

పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.