అల్లంపై పొట్టు తీసి.. సున్నపుతేటలో ముంచి ఎండబెడితే అది శొంఠిగా మారుతోంది.
శొంఠిని సంస్కృతంలో మహాఔషధి, విశ్వభేషజం అని అంటారు.
అనేక రోగాలను నివారించడంలో శొంఠి అత్యంత కీలకంగా పని చేస్తుంది.
ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్‌ని నివారిస్తుంది.
మూత్రపిండ సమస్యలను నియంత్రిస్తుంది. పురుషుల్లో వీర్య వృద్ధి చేస్తుంది.
శొంఠి పొడిని తిప్ప తీగ రసం కలిపి సేవిస్తే.. దీర్ఘకాలిక కీళ్ల నొప్పి సమస్య తగ్గుతుంది.
శ్వాస సమస్యలు, దగ్గు, బోధకాలు, వాత రోగాలను నియంత్రిస్తుంది.
ఆకలి వేయకుంటే.. దోరగా వేయించిన శొంఠిని, పాత బెల్లం కలిపి మెత్తగా దంచి.. రోజూ రెండు పూటల 5 గ్రాములు సేవిస్తే.. ఆకలి వేస్తుంది.
కడుపులో గ్యాస్ అధికమైతే.. గుండె నొప్పి వస్తుంది. ఈ సమస్య కోసం పావు చెంచా శొంఠి పొడిని చెంచా తేనెలో కలిసి సేవిస్తే.. గ్యాస్‌తోపాటు గుండె నొప్పి సైతం నయమవుతుంది.
దోరగా వేయించినన శొంఠి పొడిని మేకపాలతో కలిపి సేవిస్తే విష జ్వరాలు తగ్గుతాయి.
మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు.. శొంఠిని నీటీతో కలిసి మెత్తగా నూరి నుదిటిపై పెట్టుకుంటే ఆ నొప్పి నయమవుతుంది.
జాయింట్ వాపు వల్ల విపరీతమైన నొప్పితో బాధపడే వారు.. దోరగా వేయించిన అర చెంచా శొంఠి పొడిని చెరుకు రసంలో కలిపి సేవిస్తే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.
దోరగా వేయించిన శొంఠి పొడి, సైంధవ లవణం పొడి రోజూ మూడు పూటలా గోరు వెచ్చని నీటిలో కానీ, తేనెతో కానీ కలిపి ఆహారం తర్వాత తీసుకుంటే.. క్రమంగా పక్షవాతం తగ్గుతుంది.
చిటికెడు శొంటి పొడిని ఒక చెంచా వంట ఆముదంతో కలిసి తీసుకుంటే.. నడుము నొప్పి, పక్కటెముకల నొప్పి తగ్గుతాయి.