ప్రతిరోజు  చెరకు రసం తాగవచ్చా..  

రోజూ చెరుకు రసం తాగడం వల్ల శరీర వేడి తగ్గి, శరీరం చల్లబడుతుంది.

చెరుకు రసంలో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఇనుము ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేసి వ్యర్థాలను తొలగించే గుణాన్ని కలిగి ఉంటుంది.

చెరుకు రసం కాలేయానికి చాలా మంచిది. కామెర్లు ఉన్నవారు కూడా దీన్ని తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది.

చెరుకు రసంలో ఇనుము అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తహీనతను నివారించవచ్చు.

రోజూ కొద్ది మొత్తంలో చెరుకు రసం తాగడం వల్ల మీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్ణం, కడుపు నొప్పి తగ్గుతాయి.