కాఫీలో కెఫీన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
ఇవి ఏకాగ్రతను పెంచడం, శక్తినివ్వడం, వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
ఒక కప్పు కాఫీలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగడం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.
కాఫీలో నెయ్యి కలపడం వల్ల రుచి కూడా మెరుగుపడుతుందంటున్నారు.
కాఫీలో నెయ్యి కలుపుకోని తాగడం వల్ల కొవ్వులు కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
నెయ్యిలోని కొవ్వులు, కాఫీలోని కెఫీన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది ఏకాగ్రతను పెంచడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.