ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

జుట్టు సమస్యలకు ఉసిరికాయ షాట్ అద్భుతమైన సహజ పరిష్కారమనే చెప్పాలి.

అయితే ఉసిరికాయ షాట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

నాలుగైదు ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసి అరకప్పు నీటిలో వేయాలి.

ఆ మిశ్రమాన్ని బ్లెండర్‌లో వేసి బాగా బ్లెండ్ చేయాలి, వచ్చిన జ్యూస్ వడకట్టాలి.

దాంట్లో రుచికి తగినంత తెనే లేదా బెల్లం వేసుకుని ఖాళీ కడుపుతో తాగాలి.

గ్లాసు గోరువెచ్చని నీటిలో టీ స్ఫూన్ ఉసిరికాయ పొడి వేసి బాగా కలపాలి.

కొన్ని నిమిషాలు అలాగే వదిలేసి, ఆ తర్వాత నిమ్మరసం కలుపుకుని తాగాలి.

ఈ విధంగా ఉరిసికాయ షాట్‌లు రోజూ తీసుకుంటే జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి.