పల్లి నూనెను ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తోందంటూన్నారు.
వీటిని వినియోగించడం వల్ల.. శరీరానికి కావాల్సిన ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు అధిక పరిమాణంలో లభిస్తాయి.
ప్రతి రోజు ఈ నూనెను వినియోగించడం వల్ల గుండె సమస్యలు రావు. అలాగే శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
ఈ నూనె తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతోంది.
పల్లి నూనెలో గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
పల్లి నూనెలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడానికి సహాయపడతాయి.
జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది.
పల్లి నూనెలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. ఇది చర్మ సమస్యలను తగ్గించేందుకు దోహదపడుతోంది. దీంతో పాటు ముడతలు, ఇతర వృద్ధాప్య సంకేతాలను నిరోధిస్తోంది.