దోసకాయ తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..
అందరు ఇష్టంగా తినే దోసకాయ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచంలో అత్యధికంగా పండించే పంటలలో దోసకాయ నాలుగో స్థానంలో ఉంది.
ఆరోగ్యానికి అవసరమైన విటమిన్‌లు, మినరల్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి.చర్మ సౌందర్యానికి సంబంధించిన ఉత్పత్తుల్లో సైతం వీటిని వినియోగిస్తారు.
దోసకాయలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది.
వీటిలో 90 శాతం నీరు ఉంటుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతోంది. వేసవిలో దోసకాయ తీసుకోవడం మంచిది.
దోసకాయలో యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలాగే వీటిలో కంటి వ్యాధులను తగ్గించి.. ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తోంది.
జస్ట్ 15 నిమిషాల పాటు కళ్ళపై దోసకాయ ముక్కలు ఉంచటం వలన ఉపశమనం పొందవచ్చు.
ఇన్సులిన్ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచే హార్మోన్ దోసకాయలో ఉందని పరిశోధనల్లో తేలింది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు, దోసకాయ రసాన్ని తాగటం వలన మంచి ఫలితం ఉంటుంది.
శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గించే స్టేరాల్ అనే మూలకం దోసకాయలో ఉంటుంది.
ఇవి తింటే.. బరువు తగ్గుతారు. అధిక పోషకాలను కలిగి ఉంటుంది. తక్కువ క్యాలరీలు అందిస్తుంది.
అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండి..జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
దోసకాయలో ఉండే నీటి శాతంతో.. శరీరంలోని విష,హానికర పదార్థాలను బయటకు పంపిస్తాయి.
శరీరాన్ని చల్లబరచి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. జుట్టు,గోళ్ళ పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషించే సిలికాను పుష్కలంగా కలిగి ఉంటుంది.
దోసకాయ వలన చర్మ సమస్యలను, ర్యాషస్‌ను దూరం చేస్తోంది. చర్మ ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్ సి వీటిలో పుష్కలంగా లభిస్తుంది.
Related Web Stories
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగితే ఇంత డేంజరా? అలవాటు ఉన్నోళ్లు ఇది తెలుసుకోండి!
బెల్లం టీ గురించి మీకు ఈ విషయాలు తెలుసా...
రాత్రి పూట పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!
బ్యాక్ పెయిన్ సమస్యగా ఉందా.. ఇలా ట్రై చేయండి..