ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగితే ఇంత డేంజరా? అలవాటు ఉన్నోళ్లు ఇది తెలుసుకోండి!

కొంతమందికి ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇది మంచిదా? చెడ్డదా? అనేది తెలుసుకోవాలి.

ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం పెరిగి, కడుపు పూతలు, గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు దీన్ని నివారించాలి.

ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల వణుకు, హృదయ స్పందన రేటు పెరగడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.

 బ్లాక్ కాఫీ కూడా నిద్రను ప్రభావితం చేస్తుంది.  పడుకునే ముందు బ్లాక్ కాఫీ తాగడం మానుకుంటే మంచిది.

ఒత్తిడితో బాధపడేవారు బ్లాక్ కాఫీ తాగడం మానేయడం బెటర్‌.