జాజికాయ వల్ల ఇన్ని  లాభాలున్నాయా..?

ఆరోగ్యానికి మేలు చేసే ఆయుర్వేద మూలికల్లో జాజికాయ ఒకటి. ఇది వంటలకు ప్రత్యేక రుచిని తీసుకురావడమే కాదు.. ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

వీటిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్ అధిక మోతాదులో ఉంటాయి. 

జాజికాయ పొడి కలిపిన నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతోంది. దీనిని పరగడుపున తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

వీటిలో ఔషధ గుణాలున్నాయి. అలాగే అనేక పోషకాలు సైతం వీటిలో ఉన్నాయి.  

జాజికాయ పొడిని నీటితో కలిపి ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జాజికాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. 

జాజికాయలో నొప్పిని తగ్గించే గుణాలున్నాయి. ఇది తలనొప్పి, మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

జాజికాయలో ట్రిప్టోఫాన్ వంటి సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మెదడుపై ఒత్తిడిని తగ్గించి, శరీరం, మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి.

జాజికాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడానికి దోహదపడతాయి. 

జాజికాయ నీటిని తాగడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అలాగే జాజికాయ పొడి కలిపిన నీరు తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మం ముడతలు రాకుండా ఉంటుంది.