ప్రతి రోజూ జస్ట్ 15 నిమిషాలు సైక్లింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.
సైక్లింగ్ చేయడం వల్ల ముఖ్యంగా కాళ్లు, పిక్కలు, తొడలోని కండరాలు బలంగా మారుతాయి. లోయర్ బాడీ మొత్తం స్ట్రాంగ్‌గా తయారవుతోంది.
కండరాలు బలంగా తయారవడంతో శక్తివంతమైన శరీరాన్ని కలిగి ఉంటారు. అధిక సమయం కూర్చొని ఉద్యోగాలు చేసే వారికి ఇది చాలా ప్రయోజనం.
సైక్లింగ్ వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ జరుగుతోంది. ఇది గుండె పని తీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
పావు గంట సైక్లింగ్ చేయడం వలన గుండె సమస్యల రిస్క్ తక్కువగా ఉంటుంది. రక్తనాళాలు శుభ్ర పడడంతోపాటు బీపీ సమస్యలు తగ్గుతాయి.
ఉదయం లేదా సాయంత్రం సైక్లింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
సైక్లింగ్ చేయడం వలన శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
సైక్లింగ్ క్రమంగా చేయడం వల్ల శరీరం బలంగా మారడమే కాకుండా బ్యాలెన్స్ కూడా మెరుగవుతుంది.
సైక్లింగ్.. ఇంపాక్ట్ వ్యాయామం. అంటే ఇది కీళ్లపై ఎక్కువ ఒత్తిడి వేయదు. దీని వల్ల మోకాళ్ళు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం.
సైక్లింగ్ చేసిన తర్వాత శరీరానికి సరైన అలసట వస్తుంది. ఫలితంగా రాత్రి సమయానికి మనసు ప్రశాంతంగా ఉండటంతో మంచి నిద్ర పడుతుంది.
సైక్లింగ్.. శరీరంలోని అవయవాలకు మంచి ఆక్సిజన్ అందిస్తుంది. దీని వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
సైక్లింగ్ వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. దీని వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
హై బీపీ ఉన్నవారు కూడా సైక్లింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.