పైల్స్ సమస్యకు నయా పైసా ఖర్చు లేని సింపుల్ చిట్కా

కరక్కాయతో 150కి పైగా వ్యాధుల్ని నయం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

శరీరంలోని కొవ్వును కరక్కాయ కరిగిస్తుంది.

కరక్కాయ పొడిలో ఉప్పు వేసి.. పళ్లు తోముకోవడం వల్ల చిగుళ్లు గట్టి పడతాయి. 

కరక్కాయను నమలడం వల్ల పిప్పి పన్ను పోటు తగ్గుతుంది.   

భోజనానికి అరగంట ముందు.. కరక్కాయ చూర్ణంతో కలిపి బెల్లం రెండు పూటలా తీసుకుంటే రక్తమొలలు తగ్గిపోతాయి.

కరక్కాయలో చలవ చేసే గుణం ఉంది. ఇది పైత్యాన్ని హరిస్తుంది.

దగ్గుతో బాధపడేవారు చిన్న కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకుంటే ఉపశమనం లభిస్తోంది. దీర్ఘకాలిక దగ్గుకు కరక్కాయ మంచి పరిష్కారం.

ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు ఇది తోడ్పడుతుంది.

చిన్న పిల్లలకు పాలలో కరక్కాయ పొడి కలిపి తినిపించవచ్చు. దీని వల్ల జలుబు, దగ్గు తగ్గుతుంది.

ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

దురదలు, ఎగ్జిమా వ్యాధికి ఇది మంచి రెమిడీ.

కరక్కాయతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఈ కాయ పొడిని ముఖానికి అప్లై చేస్తే మొటిమలు మాయమవుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.

కరక్కాయ ముక్కలను నీళ్లలో నానపెట్టి.. ఆ నీటిని తాగితే గుండెకు బలం. వాంతులవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్లతో కలిపి తీసుకుంటే తగ్గుతాయి.

కరక్కాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని విషాన్ని బయటకు పంపిస్తుంది. దీనిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.