నువ్వులు బలమైన ఆహారం. వీటిని ఏడు రోజులపాటు వరుసగా తీసుకుంటే.. శరీర ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వీటిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్, మాంగనీస్, విటమిన్ బి1, విటమిన్ ఇ, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
పాలల్లో కంటే నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. బాదంలో కంటే నువ్వుల్లో ఫ్యాట్స్ మెరుగ్గా ఉంటాయి.
నువ్వుల్లోని అధిక డైటరీ ఫైబర్ పేగులను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యల నుంచి బయటపడేస్తుంది.
కాల్షియం, మెగ్నీషియం, జింక్.. శరీరంలోని ఎముకలకు చేరతాయి. దాంతో వాటి సాంద్రత పెరుగుతుంది. కీళ్ల నొప్పులతోపాటు పలు సమస్యలు ఉన్నవారికి ఇవి లూబ్రికేషన్‌లా పని చేసి.. బలాన్ని అందిస్తాయి.
వీటిలోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. రక్తనాళాల్లోని మలినాలు తొలగించి.. రక్త ప్రసరణ మెరుగుపరస్తాయి. అధిక రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
వీటిలోని విటమిన్ ఈ, జింక్ చర్మానికి తేమను అందిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌తో యాంటీ ఆక్సిడెంట్లు పోరాడి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది. తెల్లజుట్టును నల్లగా ఒత్తుగా మారుస్తుంది.
నువ్వుల్లోని టైరోసిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది మెదడులోని సెరటోనిన్ స్థాయిని పెంచి ఒత్తిడి, చిరాకును తగ్గిస్తుంది. మంచి నిద్ర పట్టేలా చేస్తోంది.
మహిళల్లో హార్మోన్ల మార్పులను, పీసీఓఎస్, క్రమరహిత పీరియడ్స్, మోనోపాజ్ సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి.
పురుషుల్లో జింక్, యాంటీఆక్సిడెంట్లు.. లైంగిక శక్తిని, సామర్థ్యాన్ని పెంచి, శక్తిని అందిస్తాయి.
వీటిని చిన్నగా వేయించి తీసుకోవాలి. అలా చేయడం వల్ల జీర్ణం కావడం సులభం అవుతుంది.
వీటిని బాగా నమిలి తినాలి. అలా అయితే లాలాజలంతో కలిసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
నువ్వులంటే అలర్జీ ఉన్నవారు, కడుపులో అధిక వేడి, అసిడిటీ ఉన్నవారు వీటిని నానబెట్టి తీసుకోవాలి. ఒక వేళ తీసుకోవాలంటే.. వైద్యుడి సూచనలు పాటించి తీసుకోవడం మేలు.