నోటి దుర్వాసనను ఇలా తరిమి కొట్టండి

రోజుకు రెండుసార్లు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయండి.

రోజుకు కనీసం ఒకసారైనా ఫ్లాస్ చేయండి. ఇది పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని తొలగిస్తుంది.

నాలుకపై పేరుకుపోయే బ్యాక్టీరియాను తొలగించడానికి నాలుకను కూడా శుభ్రం చేసుకోండి.

నోటిని తేమగా ఉంచడానికి తరచుగా నీళ్లు తాగుతూ ఉండండి.

పొగాకు, ఆల్కహాల్, అధిక కెఫిన్‌కు దూరంగా ఉండండి.

తులసి ఆకులు నమలడం లేదా టీ తాగడం వంటివి సహజసిద్ధంగా వాసనను తగ్గిస్తాయి.

క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించండి.