తలనొప్పుల రకాలు, వాటి లక్షణాలు..

మైగ్రేన్ తలనొప్పి మైగ్రేన్ తలనొప్పి సాధారణంగా రెండు గంటల నుంచి మూడు రోజుల వరకు ఉంటుంది. చిన్న సౌండ్ వచ్చినా, లైటింగ్ ఎక్కువైనా ఇబ్బందిగా ఉంటుంది. వాంతులు, వికారం లక్షణాలు కనబడతాయి.

టెన్షన్ తలనొప్పి ఈ టెన్షన్ తలనొప్పి అలసట, ఆందోళన కారణంగా వస్తుంది. తల వెనుక, నుదిటిపై నొప్పి వస్తుంటుంది. తలపై టోపీ పెట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఇది కొన్ని గంటల్లో తగ్గిపోతుంది. 

దీర్ఘకాలిక తలనొప్పి ఈ తలనొప్పి 15 రోజుల నుంచి 3 నెలల వరకు వేధిస్తుంది. ఎప్పుడూ నొప్పిగా, డిమ్‌గా ఉన్నట్టు ఉంటుంది. దీనికి సకాలంలో చికిత్స తీసుకోవాలి.  

సైనస్ తలనొప్పి సైనసైటిస్ ఉన్న వ్యక్తులకు ఈ తలనొప్పి వస్తుంది. నుదురు, బుగ్గలు, కళ్లు చుట్టూ తీవ్రంగా నొప్పి వస్తుంది. 

హిప్నిక్ తలనొప్పి ఈ తలనొప్పి మూడు గంటల వరకు ఉంటుంది. తలకు రెండు వైపులా నొప్పి ఉంటుంది. ఈ తలనొప్పి వచ్చినపుడు సౌండ్, లైటింగ్ ఇబ్బంది పెడతాయి. 

క్లస్టర్ తలనొప్పి జలుబు వల్ల ఈ తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ముక్కు ఒకవైపు మూసుకుపోవడం, ఊపిరి ఆడకపోవడం మొదలైన కారణాల వల్ల ఈ తల నొప్పి వస్తుంది. ఈ తల నొప్పి 2 గంటల వరకు ఉంటుంది.

హెమిక్రానియా ఈ తలనొప్పి దీర్ఘకాలం వేధిస్తుంది. తలపై ఒక వైపు మాత్రమే ఈ నొప్పి వస్తుంది. నుదురు, కళ్లు కూడా నొప్పెడతాయి. 

తీవ్ర శ్రమ వల్ల తలనొప్పి అధికంగా వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని నీరు ఎక్కువ స్థాయిలో బయటకు పోతే ఈ తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి కొద్ది నిమిషాల వ్యవధిలోనే తగ్గిపోతుంది. 

చత్వారం వయసు పెరిగే కొద్దీ కళ్లకు చత్వారం వచ్చి తలనొప్పి మొదలవుతుంది. తగిన చికిత్స తీసుకోకపోతే ఇది దీర్ఘకాలం కొనసాగుతుంది.