తవుడు నూనెతో సూపర్ బెనిఫిట్స్..

తవుడు నూనె. దీనినే రైస్ బ్రాన్ ఆయిల్ (Rice Bran Oil) అని పిలుస్తారు.

ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని గామా ఓరిజనాల్ (Gamma - Oryzanol) కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఈ నూనె జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక.

ఇది అధిక వేడిని తట్టుకోగలదు. డీప్ ఫ్రెయింగ్, స్టైర్ ఫ్రైయింగ్, ఇంత వంటకాలకు చాలా మంచిది.

ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచి.. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

కడుపులో పేగులను ఆరోగ్యంగా ఉంచి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇందులో ఉండే టోకోఫెరోల్స్, టోకోట్రియానాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.