మిరియాలలో ఉండే 'పైపరీన్' అనే పదార్థం శరీరంలో రోగనిరోధక కణాలను ఉత్తేజపరుస్తుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. 

పసుపులో 'కర్కుమిన్' అనే పదార్థం ఉంటుంది. పాలు లేదా వంటల్లో పసుపు వాడటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

వెల్లుల్లిలో ఇందులో 'అల్లిసిన్' అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. అల్లం గొంతు నొప్పి, వాపు,వికారాన్ని తగ్గిస్తాయి.

పాలకూరలో విటమిన్- సి తో పాటు బీటా కెరొటిన్ ఉంటుంది. బ్రోకలీలో విటమిన్ ఎ, సి,ఇ తో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

పెరుగులో రోగనిరోధక శక్తిలో 70% జీర్ణవ్యవస్థలోనే ఉంటుంది.  పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి.

నిమ్మకాయ, నారింజ, బత్తాయి, కివీ, ఉసిరికాయలో ఉండే విటమిన్-సి.. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. 

గుడ్లలో విటమిన్-డి ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తి క్రమబద్ధంగా ఉంచుతుంది. చికెన్‌లో అమైనో యాసిడ్స్ శ్వాసనాళాల్లో వాపును తగ్గించి, త్వరగా కోలుకునేలా చేస్తాయి.

బొప్పాయిలో విటమిన్-సి తో పాటు 'పపైన్'  అనే జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది వాపును తగ్గిస్తుంది. మంచి ఎనర్జీ ఇస్తుంది. 

తులసి ఆకుల్లో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. శ్వాసకోస సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి.

వాల్‌నట్స్‌లో మెగ్నీషియం, కాపర్ ఉంటాయి. బాదంలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.