నల్ల వెల్లుల్లి.. క్యాన్సర్‌కు  చెక్ పెట్టగలదా..?

సాధారణ వెల్లుల్లిని ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద 15 రోజులు పులియబెడితే నల్ల వెల్లుల్లి తయారవుతుంది. తెల్ల వెల్లుల్లితో పోల్చుకుంటే ఇది తక్కువ ఘాటుగా ఉంటుంది. 

నల్ల వెల్లుల్లిలో యాంటీ-ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడతాయి దీర్ఘ కాలిక వ్యాధుల బారి నుంచి కాపాడతాయి. 

రక్తపోటును నియంత్రించడంలో నల్ల వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. కొలస్ట్రాల్ స్థాయులను నియంత్రించి హృదయ రోగాల బారి నుంచి కాపాడుతుంది. 

రోజూ పరగడుపున నల్ల వెల్లుల్లి తింటే  బ్లడ్ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 

నల్ల వెల్లుల్లిలో ఉండే అలిసిన్‌ అనే సమ్మేళనం జీవక్రియల్ని వేగవంతం చేస్తుంది. తద్వారా శరీరంలో పేరుకున్న కొవ్వులు, క్యాలరీలు కరుగుతాయి. అధిక బరువును తగ్గించడంలో తోడ్పడుతుంది

నల్లవెల్లుల్లిలోని కొన్ని సమ్మేళనాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు దరి చేరకుండా ఉంటాయి. 

నల్ల వెల్లుల్లిలోని ప్రీ బయోటిక్స్ ఉంటాయి. వీటి వల్ల ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడతాయి. 

నల్ల వెల్లుల్లి రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను నియంత్రించడంలో కూడా సహాయ పడుతుంది. అలాగే క్యాన్సర్ కణాల వృద్ధిని కూడా అరికడుతుంది.