చియా సీడ్స్ తినటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే, ఈ సమస్యలు ఉన్నవారు చియా సీడ్స్‌ను తినకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జీర్ణ సమస్యలు ఉన్నవారు చియా సీడ్స్ జోలికి వెళ్లకపోవటమే మంచిది. లేదంటే సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

చియా సీడ్స్ బీపీని తగ్గించే గుణం ఉంటుంది. ఇప్పటికే లో బీపీ ఉన్నవారు చియా సీడ్స్ తినకపోవటం మంచిది.

ఇప్పటికే బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వారు చియా సీడ్స్ తీసుకోవడం వల్ల రక్తం మరీ పల్చబడే ముప్పు ఉంటుంది.

కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు చియా సీడ్స్ తీసుకోవడం వల్ల కిడ్నీల పని తీరుపై ప్రభావం పడుతుంది. 

ఆవాలు, నువ్వుల వంటి గింజలతో అలర్జీ ఉన్నవారు చియా విత్తనాలతో జాగ్రత్తగా ఉండాలి.

చియా సీడ్స్‌ను ఎప్పుడూ నానబెట్టిన తర్వాతే తినాలి. పొడిగా తినడం వల్ల గొంతులో చిక్కుకునే ప్రమాదం ఉంది.