ఆవు పాలు vs గేదె పాలు:  ఆరోగ్యానికి ఏవి మంచివి..?

గేదె పాలతో పోల్చుకుంటే ఆవు పాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఆవు పాలలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు సమపాళ్లలో ఉంటాయి. 

ఆవు పాల కంటే గేదె పాలు చిక్కగా, మంచి రుచితో ఉంటాయి. అందుకే ఎక్కువ మంది గేదె పాలను ఇష్టపడతారు

గేదె పాలలో కంటే ఆవు పాలలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 

తక్కువ కొవ్వు పదార్థాలు ఉండడం వల్ల ఆవు పాలు త్వరగా జీర్ణమవుతాయి. 

గేదె పాలలో లాక్టోస్ ఎక్కువగా ఉంటుంది. లాక్టోస్ ఎలర్జీ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ గేదె పాలు తీసకోకూడదు

కొలస్ట్రాల్ సమస్య, గుండె జబ్బులతో బాధపడుతున్నవారు ఆవు పాలు తీసుకోవడం ఉత్తమం

ప్రపంచవ్యాప్తంగా గేదె పాలతో పోల్చుకుంటే ఆవు పాలు ఎక్కువగా లభ్యమవుతాయి. 

గేదె పాలు రుచిగా ఉన్నప్పటికీ, ఆవు పాలు అన్ని విధాలుగా మంచివి. పోషకాలు సమతూకంలో ఉంటాయి