స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి ఒత్తిడి తగ్గించి, రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి.

సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు దూరం చేస్తాయి.  

శనిగలు, రాజ్, పెసల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయంలోని నిల్వ ఉన్న  విటమిన్-ఎ కంటికి చేరేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ల్యూటిన్, జియాక్సంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి

గుడ్డులోని సొనలో కంటికి అవసరమైన జింక్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి రెటినాను ఆరోగ్యంగా ఉంచుతాయి.  

చికెన్‌లో జింక్, విటమిన్-ఎ ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యం మెరుగుపరచడంలో తోడ్పడతాయి. 

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి ఒత్తిడి తగ్గించి, రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి.