నెలసరి నొప్పులకు.. ఈ గింజలు దివ్య ఔషధం

బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికి తెలిసిందే. ఆ పండులోని గింజలు (విత్తనాలు) పనికి రావని అంతా పడేస్తు ఉంటారు.

ఈ విత్తనాలు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.

బొప్పాయి విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని అనేక సమస్యలను నియంత్రిస్తుంది. 

ఈ గింజలు జీర్ణ సమస్యలకు మంచి పరిష్కారం. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు బాగా పని చేస్తాయి. ఒకటి లేదా రెండు విత్తనాలను మెత్తగా నలిపి గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలపాలి. భోజనం అనంతరం రోజుకు ఒక సారి తాగితే జీర్ణవ్యవస్థ బాగుపడుతుంది.

ఈ గింజలు మహిళలకు నెలసరి సమయంలో వచ్చే సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. నెలసరి క్రమంగా రావడానికి ఇది తోడ్పడుతుంది. టీ స్పూన్ బొప్పాయి విత్తనాల పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. 

నెలసరి రావడానికి మూడు లేదా నాలుగు రోజుల ముందు నుంచి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

ఈ విత్తనాలు చర్మానికి సహజ టోనర్‌‌లా పని చేస్తాయి. టీ స్పూన్ విత్తనాల పొడిని తీసుకుని.. అందులో ఒక స్పూన్ తేనె లేదా పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని తయారు చేయాలి. ఈ ప్యాక్‌‌ను ముఖంపై రాసి వారానికి కనీసం ఒకసారి వాడితే చర్మం ఆరోగ్యం, కాంతివంతంగా మారుతుంది.

టీ స్పూన్ విత్తనాల పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగాలి. దీని వల్ల శరీరంలోని మలిన శ్లేష్మం తొలగిపోతుంది.

బొప్పాయి గింజలను సరిగ్గా వినియోగిస్తే.. చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణ సమస్యల నుంచి చర్మం, నెలసరి, శ్వాస సమస్యలు తొలగిస్తుంది.