తాటిబెల్లంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా దీనిని వాడ వచ్చని అంటున్నారు.
మహిళల్లో నెలసరి సమస్యలు సహా పలు రకాల అనారోగ్యాలను దూరం చేసి.. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఇస్తుందని సూచిస్తున్నారు.
తాటిబెల్లంలోని ఖనిజ లవణాలు చక్కెరతో పోలిస్తే 60 రెట్లు అధికంగా ఉంటాయి. కాఫీ, టీ, పండ్ల రసాల్లో ఈ బెల్లాన్ని వినియోగించ వచ్చు.
జీర్ణక్రియ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి.. అజీర్తిని దూరం చేస్తుంది.
శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే కాకుండా.. ఇందులోని పీచు పదార్థం మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది.
ఇందులోని ఇనుము, మెగ్నీషియం రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో రక్తహీనత ఏర్పడదు.
యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడతాయి. వీటిలో కాల్షియం, పొటాషియం, భాస్వరం మూలకాలు.. ఎముకల బలహీనత నుంచి రక్షిస్తాయి.
నెలసరి, అధిక బరువు సమస్యలకు చెక్ పెడుతుంది.
మైగ్రేన్ వచ్చినప్పుడు నోట్లో చెంచా బెల్లం పొడి వేసి చప్పరిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. వేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లబరుస్తుంది.
పొడి దగ్గు, జలుబు వంటి వాటికి తాటి బెల్లం దివ్య ఔషధంగా పని చేస్తుంది. గోరు వెచ్చని కప్పు పాలలో చెంచా తాటిబెల్లం పొడి, పావు చెంచా మిరియాల పొడి కలిపి తీసుకుంటే.. వెంటనే ఉపశమనం కలుగుతుంది.
జలుబు వల్ల చేరిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది. ఊపిరితిత్తుల పని తీరును మెరుగుపరుస్తుంది. ఆస్తమాకి దూరంగా ఉంచుతుంది.
పొడి దగ్గు, జలుబు వంటి వాటికి తాటి బెల్లం దివ్య ఔషధంగా పని చేస్తుంది. గోరు వెచ్చని కప్పు పాలలో చెంచా తాటిబెల్లం పొడి, పావు చెంచా మిరియాల పొడి కలిపి తీసుకుంటే.. వెంటనే ఉపశమనం కలుగుతుంది.