జాజికాయ.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ప్రత్యేక సుగంధ ద్రవ్యం. మన ఆరోగ్యాన్ని బాగు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
వీటిలో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలుంటాయి. జాజికాయలో మిరిస్టిసిన్, యూజినాల్, ఐసోయుజెనాల్, సఫ్రోల్ లాంటివి ఉంటాయి. ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.
అధిక ఒత్తిడి వల్ల వచ్చే సమస్యలను నియంత్రిస్తుంది. కొన్ని పరిశోధనల్లో ఇది దీర్ఘకాల జబ్బుల నుండి రక్షణ ఇచ్చే ఒక సహజ రక్షకుడిలా పని చేస్తుంది.
జాజికాయ వాడకం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మిరిస్టిసిన్ లాంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
డిప్రెషన్, ఆందోళన లాంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. నిద్ర సరిగా రాని వారికి ఇది సహాయపడుతుంది. మనసును శాంతపరిచి, మంచి నిద్రకు దారితీస్తుంది.
జాజికాయలో ఉండే గుణాలు గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. భోజనం చేసిన తర్వాత కడుపులో కలిగే ఇబ్బందిని తగ్గించడంలో ఇది సహజంగా పని చేస్తుంది.
ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, జీవక్రియ సమస్యల వల్ల వచ్చే మంటను తగ్గిస్తుంది.
జాజికాయ ఒక సహజ ఆఫ్రోడిసియాక్. కొన్ని పరిశోధనల్లో ఇది లైంగిక కోరికను పెంచుతుందని తెలింది. ముఖ్యంగా మగవారికి ఇది బాగా పని చేస్తుంది. లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది సాయం చేస్తుంది.
రాత్రి పడుకునే ముందు పాలలో కొద్దిగా జాజికాయ పొడి కలిపి తాగితే నాడీ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల నిద్ర బాగా పడుతుంది.
జాజికాయలో సూక్ష్మక్రిములను అడ్డుకునే గుణాలుంటాయి. ఇది నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సాయం చేస్తుంది. నోటి దుర్వాసనను తగ్గుతుంది. చిగుళ్లకు వచ్చే ఇన్ఫెక్షన్లను కూడా నియంత్రిస్తుంది.
దీనిలో ఉండే బ్యాక్టీరియా నిరోధక గుణాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. చర్మం మృదువుగా మారేలా చేస్తాయి. ఇది చర్మ సమస్యలకు ఒక సహజ పరిష్కారం.