షుగర్ పేషెంట్స్‌ కోసం గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే 7 పండ్లు..

ఫైబర్ పుష్కలంగా ఉండే ఆపిల్ తొక్కతో కలిపి తింటే చాలా మేలు. ఒంట్లో బ్లడ్ షుగర్, గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయి.

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లతో నిండి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.

చెర్రీ పండ్లలో అతి తక్కువ GI ఉంటుంది. వీటిలోని ఆంథోసైనిన్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. 

పియర్స్ లేదా బేరి పండ్లలో తక్కువ GI ఉంటుంది. కరిగే ఫైబర్ అధికం. నెమ్మదిగా జీర్ణమవుతాయి. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తాయి.

పీచ్ పండ్లు రుచిలో తియ్యగా ఉన్నా తాజా వాటిలో GI స్వల్పం. విటమిన్-ఎ, సి లు ఎక్కువ. హైడ్రేట్ సమస్య నివారిస్తుంది. 

కివీలో GI కాస్త ఎక్కువే అయినా మితంగా తింటే సురక్షితం. వీటిలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

రేగుపళ్లలో ఫైబర్ అధికం. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. GI తక్కువ కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు.