హైబీపీతో కంటి సమస్యలు..  వైద్యుల సలహా ఏంటంటే..

హైబీపీ అంటే సాధారణంగా అందరికీ గుండె పోటు, స్ట్రోక్ వంటివి గుర్తొస్తాయి.

అయితే, బీపీతో కంటి చూపు కూడా దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు.

కొందరికి హైబీపీ కారణంగా చూపు మందగిస్తే మరి కొందరికి కంటి స్ట్రోక్ వస్తుందని చెబుతున్నారు. 

హైబీపీ కారణంగా కంట్లోని రెటీనాలోగల సున్నితమైన రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది.

దీని వల్ల చూపు మసకబారడంతో పాటు కంటిముందు ఏవో నల్లని మచ్చలు, కాంతిపుంజాలు మెదులుతున్న భావన కలుగుతుంది.

ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే తరచూ కంటి చెకప్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

బీపీని నియంత్రణలో పెట్టుకోవాలని చెబుతున్నారు.