ముఖాన్ని ఐస్‌తో రుద్దితే చర్మం కాంతివంతం అవుతుందని కొందరు విశ్వసిస్తారు.

సెలబ్రిటీలు కూడా దీన్ని ట్రై చేయడంతో ఈ టెక్నిక్‌కు పాప్యులారిటీ పెరిగింది. 

అయితే ముఖానికి అతిగా ఐస్ రుద్దితే కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

రోజూ ముఖంపై ఐస్ పెట్టడం వల్ల ఐస్ బర్న్ ఏర్పడే రిస్క్ ఉంటుంది. 

చర్మంలోని సన్నటి రక్తనాళాలు సంకోచవ్యాకోచాలకు గురై దెబ్బతినే ప్రమాదం ఉంది. 

ఈ టెక్నిక్‌తో వచ్చే ఫలితాలు తాత్కాలికమే. కొంతసేపటికి ముఖం ఎప్పటిలాగే కాంతిహీనంగా మారొచ్చు

చర్మంపై ఐస్ పెట్టిన చోట మొద్దుబారే అవకాశం కూడా ఉంటుంది. రక్త సరఫరాకు ఆటంకాలు ఏర్పడటమే ఇందుకు కారణం

ఐస్ పెట్టుకోవాలనుకుంటే ముందు ఓ చిన్న వస్త్రంలో ఐస్‌ క్యూబ్స్‌ను చుట్టి వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.