ఈ గింజలు తింటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

పసన పండుతోనే కాదు.. వాటి గింజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఈ గింజల్లో ఫైబర్, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం, నియాసిన్, ఫోలేట్ తదితర పోషకాలు ఎన్నో ఉంటాయి.

ముఖ్యంగా ఈ గింజలు రక్త హీనతను తగ్గిస్తాయి. ఈ గింజలు తినడం వల్ల పలు రకాల దీర్ఘకాలిక సమస్యలు నయమవుతాయి. 

ఈ గింజల్లో విటమిన్ బి అత్యధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గింజలు తినడం వల్ల తక్షణమే శరీరంలో శక్తి (ఎనర్జీ) స్థాయిలు పెరుగుతాయి.

వీటిని తీసుకోవడం వల్ల మెదడు పని తీరుతోపాటు ఆరోగ్యకరమైన కణాలను మెరుగుపరుస్తుంది. 

ఈ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలోని హిమాగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడే వారు.. ఈ గింజలు తీసుకోవడం మంచిది.  

ఈ గింజలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వైరల్ వ్యాధులు దరి చేరవు.

ఈ గింజల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అధిక ఆకలి వేస్తుంటే.. ఈ పనస గింజలు తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతారు.

వీటిని స్వల్పంగా తీసుకుంటే.. కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు.. వీటిని తీసుకోవడం ఉత్తమం.

ఈ గింజలను ఉడకబెట్టి లేదా కాల్చి తిన్నా రుచికరంగా ఉంటాయి.