దొండకాయ తింటే ఇన్ని లాభాలా..?

దొండకాయ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

వీటిలో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇవి శరీరానికి కావాల్సిన ఖనిజాలను అందిస్తుంది.

వీటిలో విటమిన్ ఏ, సీతోపాటు కాల్షియం, పొటాషియం, ఐరన్ ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపేతం చేసి.. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఆరోగ్యకరమైన చర్మానికి తోడ్పాటును అందిస్తుంది. అలాగే నోటి పూత సమస్యను తగ్గిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు దొండకాయను తీసుకోవాలి. 

బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో బీటా కెరోటీన్ ఉంటుంది. ఇవి ఆక్సిడేటివ్స్ నుంచి కాపాడుతుంది. ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తుంది.

వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి ఆర్థరైటీస్ నుంచి కాపాడుతుంది. కాలేయం ఆరోగ్యాన్ని సైతం రక్షిస్తుంది.