జుట్టుకు అవసరమైన కెరాటిన్‌ను తయారు చేయటంలో బయోటిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

బయోటిన్ సరైన స్థాయిలో అందకపోతే కెరాటిన్ తయారీపై ప్రభావం పడుతుంది. 

అందుకే బయోటిన్ పుష్కలంగా ఉండే ఈ 5 ఆహారాలను డైట్‌లో తప్పని సరిగా చేర్చుకోవాలి.

నాన్ వెజ్ తినే వారికి గుడ్లు బెస్ట్ చాయిస్. గుడ్లలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది.

 ప్రతీ రోజూ 10 బాదాం గింజల్ని తింటే జుట్టు చాలా సిల్కీగా తయారు అవుతుంది. వెంట్రుకలు విరిగిపోకుండా కూడా ఉంటాయి.

స్వీట్ పొటాటోలో బయోటిన్‌తో పాటు బీటా కెరోటిన్ జుట్టుకు అవసరమైన ఇతర పోషకాలు కూడా ఉంటాయి.

శనగల్లో కేవలం బయోటిన్ మాత్రమే కాదు.. ప్రొటీన్, ఐరన్, జింక్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి.

 పాలకూరలో బయోటిన్, ఐరన్, ఫోలెట్, విటమిన్ సీ అధికంగా ఉంటాయి.