పచ్చిచేపల్లో లీన్ ప్రోటీన్లు,ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఏ, బి12, డీ,కే విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాల్షియం, అయోడిన్, కాపర్ వంటి ఖనిజాలు, సెలీనియం అధిక మోతాదులో ఉంటాయి.

ముఖ్యంగా గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక స్థాయిలో కలిగి ఉంటాయి.

పచ్చి చేపలను సరిగ్గా శుభ్రం చేసుకుని వండుకోకపోతే ఇందులోని బ్యాక్టీరియా కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

పచ్చి చేపల్లో ఉన్నంత స్థాయిలో కాకపోయినా డ్రై ఫిష్‌లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, పోషకాలు ఉంటాయి.

 ఎండబెట్టిన తర్వాత వీటిలోని నీటి శాతం తగ్గడం వల్ల ఎండు చేపల్లో పోషకాలన్నీ ఒక్కచోటకు చేరతాయి.

ఎంతలా అంటే కిలో పచ్చిచేపల్లో 200 గ్రాముల ప్రొటీన్ ఉంటే కిలో డ్రై ఫిష్‌లో సుమారు 600 గ్రాములు ఉంటుంది.

మరో విషయం ఏంటంటే వీటిలో సోడియం కంటెంట్ పచ్చిచేపల కంటే అత్యధికంగా ఉంటుంది.

 పోషకాల పరంగా ఎండు చేపలు మెరుగైనవి, కానీ.. మీ ఆరోగ్యం, ఆహార అలవాట్లపై ఆధారపడి మీరు ఎండు చేపలు లేదా పచ్చి చేపలు ఎంచుకోవచ్చు.