రాత్రిళ్లు నిద్రపోయినా పగలు నిద్ర మత్తు వదలకపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి

మానసిక అలసట, ఒత్తిడి కారణంగా రోజంతా మత్తుగా, నిస్సత్తువగా ఉండే అవకాశం ఉంది. 

యాంటీహిస్టమైన్స్, యాంటీడిప్రెసెంట్స్ వంటి మందులు వేసుకుంటే కూడా ఇలా అనిపిస్తుంది. 

ఐరన్ లోపం ఉంటే మెదడుకు కండరాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గి రోజంతా మత్తుగా అనిపిస్తుంది

స్లీప్ యాప్నియా వంటి సమస్యలు ఉన్న వారికి రాత్రి నిద్ర చాలక పగలు మత్తు ఆవరిస్తుంది. 

భోజనం సరిగా చేయకపోయినా, పోషకాహారం తక్కువైనా ఇలాంటి మత్తు ఆవరిస్తుంది.

రాత్రి పూట కంటి నిండా నిద్రపోని వారికి, కలత నిద్రపోయే వారికి రోజంతా మత్తుగా ఉంటుంది

థైరాయిడ్ హార్మోన్‌ల అసమతౌల్యతతో జీవక్రియలపై ప్రభావం పడి రోజంతా నిద్రమత్తుగా అనిపిస్తుంది.