టీనేజ్ లో ఓల్డేజ్ లా కనిపిస్తోన్నారా.. ఇవి తిని చూడండి..

ఉసిరిలో అనేక పోషకాలుంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జుట్టు అందాన్ని కూడా పెంచుతాయి.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, జుట్టు త్వరగా రాలిపోకుండా, తెల్లబడకుండా నువ్వులు సహాయపడతాయి.

ఆవు నెయ్యి జుట్టు అకాలంగా బూడిద రంగులోకి మారడాన్ని నిరోధించవచ్చు.

కరివేపాకు ఆకులు ఐరన్, కాల్షియానికి మంచి మూలం. కరివేపాకు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

మెంతులు జుట్టుకు చాలా ప్రయోజనకరమైనవి. అవి జుట్టును బలోపేతం చేయడానికి, జుట్టు రాలడాన్ని నిరోధించడానికి, జుట్టును నల్లబరచడానికి సహాయపడతాయి.

వేప.. జుట్టుకు యాంటీసెప్టిక్. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి, చుండ్రును తొలగించడానికి సహాయపడుతుంది.

సోయాబీన్స్ యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. సోయాబీన్స్ జుట్టుకు పోషకాల గని. ఇవి జుట్టును రక్షించడమే కాకుండా, కొత్త, నల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

గుడ్లలో ఉండే విటమిన్లు జుట్టును లోపలి నుంచి పోషించి, సహజంగా నల్లగా, పొడవుగా, మందంగా పెరగడానికి సహాయపడతాయి.