పేను కొరుకుడుకి మంచి విరుడుగు..

మందారం పువ్వుతో ఇన్ని లాభాలున్నాయా..

మందార పువ్వు జుట్టుకు చాలా మేలు చేస్తుంది.ఈ పువ్వు ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి.

మందార పువ్వులు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మందార పువ్వు వల్ల కలిగే కొన్ని అద్భుతమైన ప్రయోజనాల ఇవి..

ఐరన్ లోపాన్ని నివారిస్తోంది.రక్తహీనత సమస్య ఇబ్బంది పెడుతుంటే.. మందార మొగ్గలను గ్రైండ్ చేసి.. ఆ రసాన్ని క్రమం తప్పకుండా తాగితే.. ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మందార ఆకుల టీని తీసుకోవచ్చు. ఈ టీ మీకు శక్తిని ఇవ్వడమే కాకుండా.. ఎక్కువ సేపు ఆకలి అనిపించదు. జీర్ణక్రియ సైతం మెరుగుపడుతుంది. 

మందార పువ్వు తీసుకోవడం వల్ల కొవ్వు తగ్గి.. బరువు క్రమంగా దూరమవుతుంది.

అధిక రక్తపోటును నియంత్రిస్తుంది: అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు.. మందార టీ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 

మందార పువ్వుల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. మందార పువ్వులను తినడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తోంది.

తలపైన, గడ్డం భాగంలో (పురుషులు) పేను కొరుకొడు వచ్చినట్లు అయితే.. మందార పువ్వును కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా రుద్దుతే.. ఆ సమస్య నుంచి సులభంగా బయటపడ వచ్చు.