నోటి పూతను తగ్గించే పైసా ఖర్చు లేని సింపుల్ చిట్కా..

జామ ఆకుల తినడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అధిక ఫైబర్ గుణాలు మలబద్ధకాన్ని నివారిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించడంలో సహాయపడతాయి.

వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

జీవక్రియను పెంచి.. బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

మొటిమలను నయం చేయడంతోపాటు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. తద్వారా క్యాన్సర్‌ను నివారిస్తాయి.

శరీరంలో కలిగే పలు నొప్పులను సైతం నివారిస్తుంది. (కషాయం రూపంలో..)

నోటి పూత వంటి సమస్యలకు జామ ఆకులను నమలడం మంచిది. ఉదయం, సాయంత్రం కొన్ని ఆకులు నమలాలి.

కొన్ని జామ ఆకులను నీటిలో మరిగించి.. 10 నిమిషాలు నానబెట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది.