గ్రీన్ టీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ టీలో ముఖ్యంగా పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.
రక్తంలోని చక్కెర స్థాయిలను గ్రీన్ టీ క్రమబద్ధీకరిస్తుంది. గ్రీన్ టీకి శరీరంలోని కొవ్వు, రక్త పోటును తగ్గించే శక్తి ఉంది. గ్రీన్ టీ కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నియంత్రిస్తోంది.
గ్రీన్ టీ బరువు తగ్గటానికి పని చేస్తుంది. ఈ టీ తాగటం వల్ల మెదడుకు మంచిది. మతి మరుపు రాకుండా చేస్తుంది.
కీళ్ల నొప్పులతో బాధ పడే వారికి గ్రీన్ టీ ఒక దివ్య ఔషధంగా పని చేస్తుంది. ప్రతి రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగటం వలన ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతోంది.
గ్రీన్ టీలో ఎల్ థయమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒత్తిడిని నియంత్రణలో ఉంచుతోంది.
గ్రీన్ టీ తాగడం వల్ల న్యూరోడీజెనరేటివ్ సమస్యలు రావు. అల్జీమర్స్ తగ్గి.. జ్ఞాపకశక్తి పెరుగుతోంది.
ఎముకలను బలంగా మార్చడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల జీవిత కాలం పెరుగుతుంది.
గ్రీన్ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ కరుగుతోంది. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది.
గ్రీన్ టీ క్రమం తప్పకుండా తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గ్రీన్ టీలోని పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తోంది.
గ్రీన్ టీ తాగడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ ఉత్పత్తిని స్థిరంగా ఉంచుతాయి.