మన శరీరానికి ఐరన్  చాలా అవసరం.

రక్తంలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి, శరీరంలోని ఆక్సిజన్‌ ను అన్ని చోట్లకి చేర్చడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

బెల్లంలో ఐరన్ ఫోలేట్ ఎక్కువగా ఉండటం వల్ల. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పిల్లలు వృద్ధులు ఈ బెల్లం తీసుకోవడం వల్ల రక్తంలో ఐరన్ స్థాయిలు మెరుగుపడతాయి.

ఖర్జూరం, ఎండుద్రాక్ష, అంజీర్, ఆఫ్రికాట్ ఐరన్ ఎక్కువగా విటిలో ఉంటాయి వీటిని రోజుతినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది. షుగర్ లాంటి జబ్బులు ఉన్న వారు వీటిని జాగ్రత్తగా, పరిమితంగా తీసుకోవాలి.

గుమ్మడి గింజలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. చిన్న పిల్లలు ఈ గింజలను ఇష్టంగా తింటారు. వీటిలో ఉండే పోషకాలు అరుగుదల శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

నువ్వులు ఐరన్‌ తో పాటు కాల్షియం కూడా పుష్కలంగా ఇస్తాయి.100 గ్రాముల నల్ల నువ్వుల్లో సుమారు 13.9 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది.

మెంతులు కూడా ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాల్లో ఒకటి. వీటిని సూపర్ ఫుడ్స్ అంటారు. రోజువారీ పప్పు, కూరల్లో మెంతులు చేర్చుకుంటే, శరీరంలో ఐరన్ స్థాయిలు మెరుగుపడతాయి.

100 గ్రాముల డార్క్ చాక్లెట్‌ లో సుమారు 11.9 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. తక్కువ చక్కెరతో కూడిన డార్క్ చాక్లెట్ తీసుకోవడం శరీరానికి మంచిది.