గోంగూరా.. మజాకా..

గోంగూరలో అనేక పోషకాలే కాదు.. విటమిన్లు సైతం ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

దీనిలో విటమిన్ సీ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతోంది.

గోంగూరలో కేలరీల, కొవ్వు తక్కువగా ఉంటుంది. 

దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది. 

గోంగూర రొయ్యలు, గోంగూర మటన్, గోంగూర చికెన్, గోంగూర బోటి, గోంగూర పప్పు తదితర వంటకాలు తయారు చేస్తారు. 

అలాగే పచ్చడి, పులిహోర, గోంగూర కారం ఇలా చాలా రకాల వంటకాలు తయారు చేస్తారు. 

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి. ఇన్సులిన్‌ను పెంచే శక్తి గోంగూరకు ఉంది.

వీటిలో ఎ, బి1, బి2, బి9 విటమిన్లు ఉంటాయి.

గోంగూరలో ఫోలిక్‌ యాసిడ్, మినరల్స్‌ కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి.

గోంగూరలో కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది.