కర్బూజా తొక్కలో ఇన్ని పోషకాలు దాగి ఉన్నాయా..?
కర్బూజా కాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది.
కర్బూజా తొక్క తినడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతారు.
కర్బూజా కాయ చెక్కు తీసి.. తొక్కను తీసుకోవాలి. అంటే తొక్క చాలా మందంగా ఉంటుంది. ఇది తినడం వల్ల అనేక లాభాలున్నాయని అంటున్నారు.
కర్బూజా తొక్కలో అధిక పీచు పదార్థం ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. పేగులో కదలికలను మెరుగుపరుస్తుంది.
వీటిలో పొటాషియం, సిట్రులైన్ ఉండటం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఈ తొక్కలో విటమిన్ ఏ, సీ ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు తీసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ నియంత్రణంలో ఉంచడానికి సహాయపడుతుంది.
ఈ తొక్క.. పరిమితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు అంటే గ్యాస్, విరేచనాలు వచ్చే అవకాశం ఉంది.
తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు తీసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ నియంత్రణంలో ఉంచడానికి సహాయపడుతుంది.
Related Web Stories
తవుడు నూనెతో సూపర్ బెనిఫిట్స్..
కంటి ఆరోగ్యం కోసం బెస్ట్ ఫుడ్ ఇదే..
రోజుకు ఎన్ని స్ట్రాబెర్రీలు తినాలో తెలుసా?
ఆవు పాలు vs గేదె పాలు: ఆరోగ్యానికి ఏవి మంచివి..?